టి. నరసాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన నాగరాజు తన కుమారుడిని హాస్టల్లో చేర్పించి, అదే రోజు తల్లి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. మరుసటి రోజు పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నాక, ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలోని బంగారం దొంగిలించబడినట్లు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.