విషం కలిపిన మద్యం తాగి యువకుడు ఆత్మహత్య

వ్యవసాయంలో వరుస నష్టాల కారణంగా చేసిన అప్పులు తీర్చే మార్గం లేక విషం కలిపిన మద్యం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గంటా రాధాకృష్ణ (22) చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. పోలవరం మండలం కొత్త పట్టిసీమకు చెందిన అతను  గత ఏడాది డిసెంబరు 31వ తేదీ సాయంత్రం తాళ్లపూడి మండలం పైడి మెట్ట ఎత్తిపోతల పథకం సమీపంలో విషం కలిపిన మద్యం తాగాడు. ఈ విషయం గ్రామానికి చెందిన ఒకరికి చెప్పడంతో అతని తండ్రి, బంధువులు వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు అయ్యింది.

సంబంధిత పోస్ట్