తాడేపల్లిగూడెం పట్టణంలోని ఒక ప్రైవేట్ స్థలంలో మంగళవారం రాత్రి కర్రి బాపూజీ అనే వ్యక్తి తన స్థలంలో చెత్తకు నిప్పంటించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ జీవీ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం స్థల యజమానికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు అగ్నిమాపక అధికారి రామారావు తెలిపారు.