చిన్నారుల కు పోలియో డ్రాప్స్ వేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి

తాడేపల్లిగూడెం 3వ వార్డు అర్బన్ హెల్త్ సెంటర్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పల్స్ పోలియో కార్యక్రమాన్నిఆదివారం  ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ లో 35 పోలియో కేసులు నమోదైన నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో 52 కేంద్రాల ద్వారా 26వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏసుబాబు, డాక్టర్ శ్రావ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్