భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన గ్రామాలు వరదనీటి నుంచి బయటపడేలా ఏలూరు కాలువ నీటిమట్టం తగ్గించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇరిగేషన్ ఎస్ ఈ కి సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో నవాబుపాలెం, ఆరుగొలను, కొత్తూరు గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్య చెప్పుకున్నారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారికి ఫోన్ చేసి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు చేయాలని సూచించారు.