బెల్ట్ షాపులపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు దాడులు

తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో ఆదివారం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు మద్యం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులను మండల మేజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్సైలు దొరబాబు, మురళి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్