తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని ఎల్. అగ్రహారం, కొండ్రపోలు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది సాధించిన అభివృద్ధి విజయాలను, రాబోయే సంక్షేమ ప్రణాళికలను ప్రజలకు వివరించారు. అలాగే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.