తాడేపల్లిగూడెం పట్టణం 17వ వార్డుకు చెందిన అంగన్వాడీ టీచర్ గౌరీ పార్వతి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డును కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ప. గో. జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక కాగా వారిలో గౌరీ పార్వతి ఒకరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమెను మంగళవారం ఐసీడీఎస్ సీడీపీవో టీఎల్. సరస్వతి, సెక్టార్ సూపర్వైజర్ సీహెచ్ దుర్గ భవాని సిబ్బంది అభినందించారు.