తాడేపల్లిగూడెం: పోలీస్ స్టేషన్ కు చేరిన ప్రేమ పంచాయతీ

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ప్రేమ్ కుమార్ (25), యువతి (19) ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం ఇంటిలో తెలియడంతో యువతి శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ప్రేమ్ కుమార్ తన తండ్రి వద్దకు యువతిని తీసుకెళ్లి ప్రేమ విషయం చెప్పాడు. వివాహం చేసుకోవడం ఇష్టం లేదని ప్రేమ్ తండ్రి ప్రసాద్ చెప్పడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది.

సంబంధిత పోస్ట్