తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 50-60 ఏళ్ల వయసున్న యాచకుడని, పట్టాలు దాటుతుండగా ప్రమాదానికి గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గుర్తింపు ఆనవాళ్లు లభించలేదు. మృతుడి గురించి తెలిసినవారు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.