తణుకు మండలం తణుకు మున్సిపాలిటీ పరిధిలో గురువారం బాబు గారి వీధిలో ఆక్సిజన్ హాస్పిటల్ వేదికగా ప్రపంచ రంగస్థలం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మండపాక గ్రామానికి చెందిన యువ సినీ నటులు, టిక్ టాక్ స్టార్, వై .టి. మూర్తిని, ప్రముఖ రంగస్థలం కళాకారులు సిద్ధ రామకృష్ణ ,రమణమ్మలను సత్కరించారు.