పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం గుమ్మంపాడు- బల్లిపాడు గ్రామాల మధ్య పంట కాలువలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. లాకులు వద్ద మృతదేహం తేలియాడుతూ ఉండడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై దుస్తులు లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.