అత్తిలి మండలం, కె. ఎస్. గట్టు గ్రామంలో 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా "పోషణ, బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ" అనే అంశంపై బుధవారం కార్యక్రమం జరిగింది. అత్తిలి మండలం సూపర్వైజర్ ఎం. విజయకుమారి అధ్యక్షత వహించి, రోజువారీ ECCE కార్యక్రమాలు, గృహ సందర్శనలలో 34 అభివృద్ధి మైలురాళ్ల ద్వారా కౌన్సెలింగ్, మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో GMSK T N శిల్ప, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, తల్లులు పాల్గొన్నారు.