తణుకులో ఏరువాక పౌర్ణమి: రైతుల సంస్కృతికి ప్రతీకగా వేడుకలు

తణుకులో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక పాల్గొన్నారు. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున, వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో రైతులు కొత్త పంటల సాగుకు సిద్ధమవుతున్న సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. వ్యవసాయం ప్రారంభించే ముందు భూమాతకు, ఎద్దులకు, వర్ష దేవుడికి నమస్కరించి, పంటలు బాగా పండాలని రైతులు కోరుకుంటారు. ఈ పండుగ రైతుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్