పెనుగొండ మండలంలోని ఇలపర్రు గ్రామంలో సాగునీరు అందక, అధిక ఎండలతో వరి నాట్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పితానివారిపాలెంలో పంట కాలువలో పెరిగిపోయిన చెత్త వలన పంటకు సాగునీరు అందట్లేదని, అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.