తుని ఘటనలో తణుకు వాసి మృతి

తుని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన సుధీర్ మృతిచెందాడు. స్నేహితులతో కలిసి విశాఖపట్టణం నుంచి కారులో వస్తుండగా ఆగి ఉన్న లారీను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వరాడ సుధీర్‌ (32)తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. తణుకులోని పోస్టాఫీసు వద్ద సుధీర్ నివాసం ఉంటున్నారు. సుధీర్‌ మృతితో తణుకులో విషాదఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్