పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం ఇరగవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నాయకులు విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎదుర్కోవాలని వారు అన్నారు.