ఉండి మండలం వాండ్రం గ్రామంలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను శనివారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణ రెడ్డి, కార్యదర్శి రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గిరిజనుల కోసం అల్లూరి పడిన తపనను కొనియాడారు. డాక్టర్ రంగరాజు, రూత్ కళ, అనంతలక్ష్మి, బ్రహ్మారెడ్డి, హరనాధరాజు, రాము, రంగప్రసాదరాజు, వెంకట్రామరాజు, సుబ్బరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.