శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి బిజెపి ఘన నివాళి

భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125 వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఉండిలో ఆకివీడు మండల బిజెపి అధ్యక్షురాలు ఎంవియస్ నాగమణి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. దేశ సమగ్రత కోసం ఒకే దేశం ఉండాలని పోరాడి, కాశ్మీర్ కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంవియస్ నాగమణి, పట్టాభిరామయ్య, చింతా ఆదిశేషు, ఉప్పాడ శ్రీనివాస్, కొల్లు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్