పాలకోడేరు మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను, అభ్యర్థులకు అందిస్తున్న సౌకర్యాలను ఆమె క్షేత్రస్థాయిలో సమీక్షించారు.