పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో గురువారం పర్యవేక్షించారు. ఉండి, పాలకోడేరు, అత్తిలి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.