విద్యార్థుల క్రమశిక్షణతోనే ఉన్నతస్థితి: బ్రహ్మానందం

ఉండి మండలం ఆరేడు, వెంకట్రాజపురం పాఠశాలల్లో సోమవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కట్రెడ్డి బ్రహ్మానందం మాట్లాడుతూ, ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో విద్య అభ్యసిస్తే ఉన్నతస్థితికి చేరుకుంటారని అన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సుంకర శ్రీనివాస్ ఆర్ధిక సహకారంతో ఈ సామాగ్రిని పంపిణీ చేసినట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెన్మెత్స రంగప్రసాదరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్