విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కవిటం పాకలు పాఠశాలలో కార్యక్రమం

ఉండి మండల అధ్యక్షులు ఇందుకూరి హరిబాబు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. శనివారం, ఉండి మండలం అర్తమూరు శివారు కవిటం పాకలు పాఠశాలలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం దాత కీ.శే. గాదిరాజు శ్రీరామరాజు కుమారుడు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ గాదిరాజు రంగరాజు ఆర్థిక సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో వాండ్రం MPTC, లయన్ పెన్మెత్స అనజనేయరాజు, క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెన్మెత్స రంగప్రసాదరాజు, పాఠశాల HM ఉషారాణి, SMC చైర్మన్ సత్యవతి, చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగింది.

సంబంధిత పోస్ట్