పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో, బుధవారం శాసనసభ ఉప సభాపతి, ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి పథకం కింద కోటి రూపాయల రుణ మంజూరు ఉత్తర్వులను అందజేశారు. చిన్న తరహాలో చేపలు, నాటు కోళ్ల పెంపకం వంటి వాటి ద్వారా మహిళలకు మంచి ఆదాయం సమకూరుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.