యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలోని పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. భారీగా ఈదురు గాలులు వీయడంతో ఈ ఘటన జరిగినట్లు సోమవారం స్తానికులు వివరించారు. సుమారు 42 అడుగులు ఎత్తులో ధ్వజస్తంభాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేశారు. కూలిపోయిన ధ్వజస్తంభాన్ని తిరిగి నెలకొల్పేందుకు దాతలు సాయం చేయాలని ఆలయ కమిటీ కోరింది.