ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మండలంలోని ఉండి, వెలివర్రు, మహాదేవపట్నం పెదపుల్లేరు తదితర గ్రామాలకు చెందిన 55 మందికి కళ్ళజ్యోళ్లు పంపిణీ చేశారు. శివరామరాజు, నరసరాజు, డాక్టర్ రంగరాజు, బ్రహ్మారెడ్డి, రంగ, రూత్ కళ, రాము తదితరులు పాల్గొన్నారు.