బొండాడ: శ్రీ లక్ష్మి గణపతి స్వామి ఊరేగింపులో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

కాళ్ళమండల పరిధి బొండాడ గ్రామంలో శుక్రవారం శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కళాకారులచే ఏర్పాటు చేసిన కాకినాడ కాళికా నృత్య ప్రదర్శన, కేరళ నెమలి డాన్స్, హంస వాహనంపై స్వామి వారి కన్నుల పండువగా సాగిన ఊరేగింపు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి హారతులు, తీర్థ ప్రసాదాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్