పాందువ్వ గ్రామంలో మానవత సంస్థ సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామంలో ఆదివారం మానవత సంస్థ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని, వారి కన్నీటిని తుడవాలని సూచించారు. KSV సీతారామ్ ఆర్థిక సహాయంతో కొందరికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువరాజు, రామలింగేశ్వరరావు, కేటీన్, మహేష్, బి. సత్తిబాబు, మహేష్ బాబు, ఏసు బాబు, గోపి, శ్రీను, గోపాలం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్