జనసేన నాయకుడు పివిఎల్ నరసింహారాజు విలేకరుల సమావేశం

కాళ్ళ మండలం పెదఅమిరంలో జనసేన నాయకుడు పివిఎల్ నరసింహారాజు బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యక్రమాలు కార్యదర్శి తోట వాసు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గవరలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు రామాంజనేయులు, నానాజీ, బాబులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి, ఉండిలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యక్రమాలపై చర్చించారు. 2న నిర్మలా ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕