కాళ్ళ హెచ్‌పి పెట్రోల్ బంకులో సోమవారం ఘరానా మోసం బయటపడింది. కాళ్ళ గ్రామానికి చెందిన సూరిబాబు తన వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో దగ్గరలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకుకు వెళ్లి బాటిల్‌లో రూ. 100 పెట్రోల్ పట్టమని చెప్పాడు. మెషిన్‌లో ఫీడ్ చేసి బాటిల్‌లో పట్టిన తర్వాత బాటిల్ అర లీటర్ మాత్రమే ఉండడంతో విస్తుపోయాడు. మెషీన్ చూస్తే 0. 91 లీటర్ చూపుతోందని బంక్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.