ఉండిలో ఆర్టీసీ బస్సు కొత్త రూట్ ప్రారంభం

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు, మహాదేవపట్నం, వెలివర్రు గ్రామాల మీదుగా తాడేపల్లిగూడెంకు ఆర్టీసీ బస్సు కొత్త రూట్‌ను డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, 18 ఏళ్ల క్రితం రోడ్లు సరిగా లేవని ఆపివేసిన ఈ సేవను పునరుద్ధరించడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ బస్ సౌకర్యం ఏర్పాటుతో స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.

సంబంధిత పోస్ట్

✕
✕