ఈనెల 5వ తేదీన పాలకోడేరు మండలం విస్సా కోడేరు గ్రామానికి చెందిన పెనుమాక బాలసుందర భీమవరం ఓవర్ బ్రిడ్జిపై లారీ ఢీకొనగా తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం గుంటూరుకి తరలించారు. అక్కడ ఆసుపత్రుల చికిత్స పొందుతూ బాల సుందర్ శుక్రవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.