టీచర్ పై జరిగిన హత్యయత్నం కేస్ చేదించిన పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం NRP అగ్రహారంలో టీచర్ వెంకటరత్నంపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ విశ్వనాధ్ భీమవరంలో శుక్రవారం తెలిపారు. కాళ్ల మండలం బొండాడకు చెందిన కృష్ణమూర్తి, రూ. 45 లక్షలు అప్పుగా ఇచ్చి, తీర్చకపోవడంతో అతని ఇంటిని రాయించుకున్నాడు. ఆ తర్వాత రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి, ఒక మైనర్ బాలుడితో వెంకటరత్నంపై దాడి చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕