పోలియో చుక్కలు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ: ఎంపీపీ

పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండి మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ, పిల్లలకు వచ్చే ప్రాణాంతక వ్యాధుల నుంచి రెండు పోలియో చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయని అన్నారు. 0-5 ఏళ్ల వయస్సు పిల్లలందరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్