నేడు గొల్లలకోడేరులో పవర్ కట్

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో శుక్రవారం చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నట్లు భీమవరం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. దీనివల్ల ఉదయం 7. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు గొల్లలకోడేరు గ్రామంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోనున్నట్లు ఆయన తెలిపారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్