ఉండి మండలం, కాళ్లకూరులో గుడి మాడవీధుల విస్తరణ కోసం అడ్డాల వెంకటసుబ్బరాజు, పద్మావతి, వత్సవాయ పురుషోతంరాజు, సుధ, కిరణ్ కుమార్, దీప్త దంపతుల మనవలు మౌనికసింధు, కార్తికేయవర్మ రూ. 1,21,116 విరాళం అందజేశారు. ఈ విషయాన్ని చైర్మన్ అడ్డాల శివరామరాజు బుధవారం తెలిపారు. దాతలకు స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశామని ఆయన పేర్కొన్నారు.