గ్రామసభలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

ఉండి మండలం మహాదేవపట్నం సచివాలయం వద్ద శుక్రవారం గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, స్పెషల్ ఆఫీసర్ సూర్యనారాయణ రాజు, వనిమ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నాయుడు, VRO చిన్నరావు, పంచాయతీ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, డోక్రా గ్రూప్ మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. 'పరిశుభ్రత పాటిద్దాం' అని చైర్మన్ నాగరాజు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕