ఉండి మండలం, మహాదేవ పట్నం గ్రామంలో జరిగిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసన సభ్యులు కనుమూరి రఘూరామకృష్ణంరాజు పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తుంది అన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి జుత్తుగ నాగరాజు , పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.