ఆకివీడులో నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కే శుభ శేఖరును శ్రీ లక్ష్మీ గణపతి పూలు పండ్లు వర్తక సంక్షేమ సంఘం సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు. వారికి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, గాలిదేవర శ్రీను, ఐ వి వి సత్యనారాయణ, కాంతారావు, రమేష్, కారింకి ఏసు దుర్గారావు, గంటా బాలు తదితరులు పాల్గొన్నారు.