ఉండి మండలం యండగండి పార్సిల్‌లో డెడ్ బాడీ కేసు రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం భీమవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ డెడ్‌బాడీ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని రెండు మూడు రోజుల్లోనే మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు.