పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ మంతెన యోగేంద్రబాబు వైఎస్ఆర్ విగ్రహానికి జలభిషేకం చేసి, ఆయన పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.