ఉంగుటూరు జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ శుక్రవారం బోల్తా పడింది. నారాయణపురంలో చేపల ప్యాకింగ్ చేసుకొని బయలుదేరిన కంటైనర్ ఎదురుగా వెళ్తున్న టాటా ఏసీ వ్యాన్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడటంతో చేపలు రోడ్డుపై పడ్డాయి. కంటైనర్‌లో డ్రైవర్‌తో పాటు 8 మంది కూలీలు ఉండగా వారిని స్థానికులు బయటకు తీశారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.