భీమడోలు మండలం పోలసానిపల్లికి చెందిన కోట రాము(45) గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. గ్రామానికి చెందిన కోట రాముకు వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసైయ్యాడు. ఈ క్రమంలో భార్యతో గొడవ పడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. గమనించిన బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.