భీమడోలు గ్రామరెవెన్యూ అధికారిగా వీఆర్వో గంధం మార్కండేయరావు సేవలు గొప్పవని భీమడోలు తహశీల్దార్ రమాదేవి అన్నారు. గురువారం భీమడోలు తహశీల్దార్ కార్యాలయంలో మార్కండేయులు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈమేరకు మార్కండేయులు దంపతులను రెవెన్యూ అధికారులు, గ్రామపెద్దలు, ఆయన స్నేహితులు, కుటుంబసభ్యులు ఘనంగా సత్కరించారు.