ఏలూరులో మురసా తుపాను బీభత్సం: వరద నీటిలో పోలింగ్ కేంద్రాలు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో మురసా తుపాను కారణంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు నారాయణపురం రజకుల పేట, ఎస్సీ కాలనీలు జలమయమయ్యాయి. ఈ వర్షాల వల్ల మండలంలోని 79 పోలింగ్ కేంద్రాలలో సగం కేంద్రాల ఆవరణలోకి వరద నీరు వచ్చి చేరింది. తహసిల్దార్ సన్యాసిరావు మాట్లాడుతూ వరద నీటిని బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇరిగేషన్ ట్యాంకులు నిండుకుండలా ఉన్నందున గండ్లు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕