గుండుగొలను గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ఏలూరు, ఉంగుటూరులో బుధవారం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో రూ. 96 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు నిర్మాణానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఈ రహదారి నిర్మాణం రాకపోకలకు మరింత సౌకర్యం కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕