భీమడోలులో రూ.3 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

ఉంగుటూరు నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం భీమడోలు మండలంలో పూళ్ల రైల్వే గేటు నుంచి కైకరం గ్రామం వరకు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే బీటీ & సిసి రోడ్లకు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕