దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజవర్గంలోని గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు మండలాల్లో ఆర్నాబ్ తుఫాను కారణంగా భారీ ఈదురుగాలులు వీచాయి. దీనివల్ల వరి పొలాలు నేలమట్టమయ్యాయి. బుధవారం ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని, పంట నష్టాన్ని అంచనా వేయించి ప్రభుత్వపరంగా తగిన సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕