ఈనెల 15, 16న నిడమర్రు మండలం భువనపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో కొత్త బ్రేకర్ ఏర్పాటు నిమిత్తం బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏలూరు ఈఈ అంబేడ్కర్ మంగళవారం తెలిపారు. అడవికొలను, భువనపల్లి, మందలపర్రు, ఛానమిల్లి, బావాయిపాలెం గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.