నిడమర్రుకు చెందిన నండూరి శివ కార్తికేయ అనే వ్యక్తి, నిడమర్రు ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు తనను కొట్టడంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆరోపించారు. రెండు రోజులుగా తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ ఘర్షణల నేపథ్యంలో ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళగా, ఫిర్యాదు నమోదు చేయకుండా తనపై దాడి చేశారని, దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డానని తెలిపారు.